ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన AP CM చంద్రబాబు.

 బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పదగంజాం గ్రామ పంచాయతీ కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛను పంపిణీ చేశారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి వారి జీవన స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపి, జిల్లా ఉన్నతాధికారుల, నాయకులు స్వాగతం పలికారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిన్నగంజాం మండలం కొత్త గొల్లపాలెం గ్రామంలో పేదల సేవలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో మంచములో ఉన్న వడ్లమూడి సుభాషిణి కి 15వేల రూపాయల పెన్షన్ పంపిణీ చేశారు.వారి కుటుంబానికి గృహ నిర్మాణ శాఖ ద్వారా గృహాన్ని మంజూరు చేస్తామన్నారు.సుభాషిణికి ఒంటరి మహిళ పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు.సుభాషిణి చెల్లెలు భరణి చదువుకున్నంత వరకు ప్రభుత్వం తరపున చదివిస్తామన్నారు.భరణి ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద అయినాక ఏమి కావాలనుకుంటున్నా వు అని అడగాగ పోలీసు అవుతానని సమాధానం చెప్పింది.

కొత్త గొల్లపాలెం గ్రామంలో బత్తుల జాలమ్మ గృహాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు .బత్తుల జాలమ్మకు వితంతు పెన్షన్ పంపిణీ అందచేశారు. జాలమ్మకు గృహ నిర్మాణ శాఖ ద్వారా గృహాన్ని మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీఇచ్చారు.బత్తుల జాలమ్మకు గ్యాస్ కనెక్షన్ మంజూరు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి తేలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా లోన్ మంజూరు చేస్తామని చెప్పారు.

 

Scroll to Top