నరసరావుపేట మున్సిపాల్టీలో 13 అక్రమ లేఅవుట్ల గుర్తింపుహద్దు రాళ్లు తొలగింపు.. రిజిస్ట్రేషన్ లు నిలుపుదల

పలనాడు జిల్లా సామాన్యుడి టివి వార్త: పలనాడు జిల్లా నరసరావుపేట మున్సిపాల్టీ పరిధిలోని ఆక్రమ లేఅవుట్లపై అధికారులు చర్యలు చేపట్టారు. పట్టణ పరిధిలో మొత్తం 13 అక్రమ లేఅవుట్లను గుర్తించారు. సదరు వెంచర్ల నిర్వహకులకు మున్సిపాల్టీ నోటీసులు జారీ చేసింది. అయితే సంబంధిత లేఅవుట్లకు చెందిన వారు నోటీసులకు స్పందించ లేదు. దీంతో అధికారులు ప్రత్యక్ష చర్యలకు దిగారు. ఈ క్రమంలో మంగళవారం మున్సి’పల్ అధికారులు సత్తెనపల్లిరోడ్డులోని సాయినగర్ లోని లేఅవుట్ హద్దు రాళ్లను తొలగించారు. ఆయా లే అవుట్లలో రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా పట్టణ పరిధిలో వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్లలో రిజిస్టేషన్ల నిలుపుదలతో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. రిజిస్టేషన్లు నిలుపుదల చేసిన వెంచర్ల వివరాలను రిజిస్ట్రార్ కార్యాలయం విడుదల చేసింది. సత్తెనపల్లి రోడ్డులోని సర్వే నెం బరు 63లో 5.60 ఎకరాలు, అదే రోడ్డులోని సర్వే నెంబరు 34లో 1.38 ఎకరాలు, ఎస్ఆర్కిటీ కాలనీ ప్రాంతంలోని 269లో 510 ఎకరాలు, 270, 275లోని 12.30 ఎకరాలు, 289లో 7.19 ఎకరాలు, కోటప్పకొండరోడ్డులోని 288, 290 సర్వే నెంబర్ ని 14.20 2, 303, 306 5 1252 2, 277 4.45 ఎకరాలు, వల్లప్ప చెరువు ప్రాంతంలోని 493, 494లో 5.25 ఎకరాలు, 495 లో 3.45 ఎకరాలు, 498/ బీ1లో 3 ఎకరాలు, గుంటూరు రోడ్డులోని 2/1లో 3 ఎకరాలు రిజిస్ట్రేషన్ నిలుపుదల చేసిన జా బితాలో ఉన్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న ఎల్ ఆర్ ఎస్ స్కీమ్ ద్వారా స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలని మున్సిపల్ కమిషనర్ జస్వంత్ సూచించారు. అనధికారిక లే ఆవుట్లలో ప్లాట్లుకొని నష్టపోవద్దని తెలిపారు. ప్లాట్లను కొనుగోలు చేసే ముందు లేఅవుట్కు ఆహ్రూవల్ ఉందో లేదు పరిశీలించుకోవాలన్నారు.*

Scroll to Top