రేణిగుంట -కాట్పాడి రైల్వే లైన్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సామాన్యుడి టివి వార్త: ఏప్రిల్ 09: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిం చిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఈరోజు జరిగిన ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అనేక ప్రాజెక్టులపై చర్చించి వాటికి అనుమతులిచ్చారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులకు పెద్దపీట వేసింది కేంద్రం. ఇందులో భాగంగా ఎప్పుడు నుంచో పెండింగ్‌లో ఉన్న రేణిగుంట– కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్ట్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేణిగుంట– కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్ట్‌ కోసం కేంద్రం రూ.1,332 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. ఈ సందర్బంగా ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి కోట వంటి ప్రముఖ యాత్రా క్షేత్రాలకు వచ్చే లక్షలాది భక్తులకు ప్రయోజనం కలగనుందని.. అలాగే తిరుపతి, వెల్లూరు ప్రాంతాలు వైద్య, విద్య రంగాలలో హబ్‌ లుగా ఉండడం వల్ల స్థానికులకు, విద్యార్థులకు, రోగులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు అందనున్నాయి. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా 17 మెజర్ వంతెనలు, 327 మైనర్ వంతెనలు, 7 పై వంతెనలు, 30 అండర్‌పాస్ వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ డబ్లింగ్ పనులు పూర్తి అయితే, రోడ్డుమార్గం మీద రద్దీ తగ్గి, రైలు మార్గం ఎక్కువ ఉపయోగిస్తారని తెలిపారు. దీని వల్ల 20 కోట్ల కిలోల కార్బన్‌డయాక్సైడ్ ఉద్గారం తగ్గుతుందని, అలాగే 4 కోట్ల లీటర్ల డీజిల్ పొదుపు అవుతుందని మంత్రి అశ్వి నీ వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే సర్వే పనులు పూర్తవడంతో, కేంద్ర కేబినెట్ నుంచి అధికారిక ఆమోదం లభించటం ఈ ప్రాజెక్టును వేగంగా అమలు చేసే దిశగా సాగనుంది.

Scroll to Top