అమరావతి, సామాన్యుడు టివి వార్త: ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రముఖుల జయంతి, వర్ధంతిలను అధికారిక కార్యక్రమాలుగా గుర్తిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయా శాఖల ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు 2025-26 ఏడాదికి సంబంధించి ఉత్తర్వులను సాధారణ పరిపాలనశాఖ విడుదల చేసింది.
