అమరావతి, సామాన్యుడు టివి వార్త: మాజీ సీఎం జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలని ఎంపీ పురందేశ్వరి డిమాండ్ చేశారు. ‘నాల్గవ సింహంగా పరిగణించే పోలీస్ వ్యవస్థ పట్ల జగన్ వ్యాఖ్యలు సరికాదు. సత్యసాయి జిల్లా ఎస్పీ.. మహిళా అనే విచక్షణ లేకుండా జగన్ మాట్లాడటం సమంజసం కాదు. పోలీసులందరినీ కించపరిచేలా జగన్ వ్యాఖ్యలున్నాయి’ అని పురందేశ్వరి మండిపడ్డారు. పోలీసులపై మాజీ సీఎం జగన్ రాప్తాడు వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
