ఆంధ్రప్రదేశ్, అమరావతి, సామాన్యుడు టివి వార్త: ఇంటర్ ఫలితాలపై బోర్డు మరో అప్‌డేట్ ఇచ్చింది. 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, మార్చి 17 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం అయింది. తాజాగా మూల్యాంకన ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కంప్యూటరీకరణ ప్రక్రియను చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 15వ తేదీలోపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈసారి మన మిత్ర వాట్సాప్ ద్వారా ఫలితాలను అందుబాటులోకి రానున్నాయి.
