అమరావతి, సామాన్యుడు టివి వార్త: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధిష్ఠానం తమ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై తీవ్రంగా స్పందించింది. వైఎస్ భారతిపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం, కిరణ్‌ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే వారిని ఎంతటివారైనా ఉపేక్షించబోమని టీడీపీ తేల్చి చెప్పింది. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించిన కిరణ్ పై కేవలం సస్పెన్షన్ మాత్రమే కాకుండా, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని టీడీపీ అధిష్ఠానం గుంటూరు పోలీసులను ఆదేశించింది. పార్టీ ఆదేశాల మేరకు పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాను గౌరవప్రదమైన రీతిలో ఉపయోగించాలనే పార్టీ సందేశాన్ని ఈ చర్య బలంగా చాటుతోందని వారు అభిప్రాయపడుతున్నరు. వైసీపీ ద్వంద్వ ప్రమాణాలు, టీడీపీ చర్య ఒక గుణపాఠం ఇక్కడ గమనార్హం ఏమిటంటే, గతంలో వైకాపా శాసనసభ్యులు సభలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులైన మహిళలను అవమానకరంగా మాట్లాడినప్పుడు, సభలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఖండించకపోగా ఆనందించారు. అంతేకాకుండా, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఆధ్వర్యంలో వైకాపా సోషల్ మీడియా నిత్యం అసభ్యకరమైన పోస్టులతో రెచ్చిపోయింది.పోసాని కృష్ణ మురళి, శ్రీరెడ్డి వంటి వారితో సైతం దిగజారుడు వ్యాఖ్యలు చేయించారు. వైఎస్ భారతి వ్యక్తిగత సహాయకుడు వర్రా రవీంద్ర రెడ్డి సైతం జగన్ సొంత కుటుంబ సభ్యులను, తల్లిని కూడా విడిచిపెట్టకుండా దారుణమైన పోస్టులు పెట్టారు. స్వయంగా వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి వంటి వారు చంద్రబాబును కించపరిచేలా షర్మిల పసుపు చీర కట్టుకుని వెళ్లారంటూ నీచంగా మాట్లాడారు.
* ఇలాంటి పరిస్థితుల్లో, చేబ్రోలు కిరణ్ ఇప్పటికే తన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేసినప్పటికీ, టీడీపీ తీసుకున్న ఈ అరెస్టు నిర్ణయం కేవలం టీడీపీ కార్యకర్తలకే కాకుండా, అన్ని రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా వైకాపా యొక్క బూతు మీడియాకు
* ఒక స్పష్టమైన హెచ్చరికను పంపుతోంది.
* సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఈ చర్య ద్వారా టీడీపీ గట్టిగా చాటి చెప్పింది.
* ఈ పరిణామం రానున్న రోజుల్లో రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.