అమరావతి : సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కొనియాడిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కొనియాడారు.శుక్రవారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన మంత్రి .కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు జ్యోతిరావు పూలే అని,స్త్రీల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు కృషిచేసిన మహనీయుడు అని తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త అని సమ సమాజ స్థాపనే జ్యోతిరావు పూలే లక్ష్యం మంత్రి సవిత తేలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేషన్ల చైర్మన్లు వీరికి వెంకట గురుమూర్తి, డూండీ రాకేష్, పలువురు డైరెక్టర్లు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గోని జ్యోతిరావు ఫూలే చిత్రపటానికి నివాళులు అర్పించారు.
