గుంటూరు సామన్యుడు వార్త : డిజిటల్ గ్రీన్, సిస్కో ఇండియా CSR మద్దతుతో మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యాన శాఖ భాగస్వామ్యంతో, 7 జనవరి 2025న గుంటూరులో రైతుల కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత వ్యవసాయ సలహా ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం జరిగింది . ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతులకు సమయానికి, స్థానిక పరిస్థితులకు అనుగుణమైన, వాతావరణానుకూల సలహాలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ ప్రాజెక్ట్‌ను ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల డైరెక్టర్ కె. శ్రీనివాసులు, IAS, ఆవిష్కరించి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా చిన్నతరహా ఉద్యాన రైతులకు దిగుబడి మరియు నాణ్యతలో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని తెలిపారు. ఫార్మర్ చాట్ ను సమర్థవంతంగా వినియోగించడం, మార్కెట్ అనుసంధానాలు బలోపేతం చేయడం ద్వారా శాఖ పూర్తి మద్దతు మరియు క్రమం తప్పని సమీక్షలు ఈ ప్రాజెక్ట్ విజయానికి కీలకమని తెలిపారు కీలకమని తెలిపారు.
మ్యానేజింగ్ డైరెక్టర్ & చీఫ్ పాలసీ ఆఫీసర్, సిస్కో ఇండియా & సౌత్ఈస్ట్ ఆసియా హరిష్ కృష్ణన్, మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు యొక్క అసలు ఉద్దేశ్యం గ్రామస్థాయిలో ఉన్న ప్రజలు సరైన నిర్ణయాలు తీసుకునేలా చేయడంలోనే ఉందన్నారు. ఫార్మర్ చాట్ లాంటి టూల్స్ రైతులకు క్లిష్టమైన సమాచారాన్ని సులభంగా అర్థమయ్యే, రోజువారీ పనులకు ఉపయోగపడే సలహాలుగా మార్చి, ఆదాయాలు పెంచడంలో, వాతావరణ మార్పులకు తట్టుకునేలా చేయడంలో సహాయపడతాయన్నారు. ముఖ్యంగా మహిళా రైతుల వరకు టెక్నాలజీ చేరేలా చేయడమే తమ లక్ష్యమన్నారు.
డిజిటల్ గ్రీన్ ఇండియా నిధి భాసిన్, CEO, మాట్లాడుతూ ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు కలిసి పనిచేసినప్పుడే కృత్రిమ మేధస్సు రైతులకు నిజమైన మేలు చేస్తుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల వరకు చేరే నమ్మకాన్ని ఇస్తే, సిస్కో మద్దతుతో, డిజిటల్ గ్రీన్ రైతులకు అనుకూలమైన, బహుభాషా AI యాప్‌ను అందిస్తోందని ఆమె తెలిపారు.
