సుమేధలో సంక్రాంతి సంబరాలు

గుంటూరు సామన్యుడు వార్త : స్థానిక గుంటూరు NGGO’s కాలనీలోని సుమేధా హై స్కూల్ లో గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలు పాఠశాల ఆవరణలో ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  సప్తర్షి ఆశ్రమ నిర్వాహకులు హైకోర్టు అడ్వకేట్ విజయ విశ్వనాధ భోగి మంటలను కర్పూర హారతితో వెలిగించి పిల్లలందరికీ భోగి పళ్ళు పోసి ఆరంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, రకరకాల ముగ్గులు, గొబ్బెమ్మలుతో అలంకరించారు. చిన్నారులకు భోగి పళ్ళు పోశారు. 

స్కూల్ డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్ రెడ్డి  మాట్లాడుతూ సంక్రాంతి అంటే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు వాటిని ఆచరించాలని తెలిపారు. విద్యార్థులు ఆటపాటలతో సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాంబాబు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top