A.T అగ్రహారం సుమేధలో సంక్రాంతి సంబరాలు

గుంటూరు సామన్యుడు వార్త : గుంటూరు A.T అగ్రహారంలోని సుమేధా హైస్కూల్ లో శుక్రవారంముందస్తు సంక్రాంతి వేడుకలు పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు.ఈ  కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ న్యూ ఇండియా ఇన్సురెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్  కంభంపాటి గోపాల కృష్ణమూర్తి భోగి మంటలను కర్పూర హారతితో వెలిగించి పిల్లలందరికీ భోగి పళ్ళు పోసి ఆరంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, రకరకాల ముగ్గులు, గొబ్బెమ్మలుతో అలంకరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులుసంక్రాంతి ఆట పాటలతో నృత్యాలతో ఉల్లాసంగా వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులకు మిఠాయిలు, కీ చైన్స్ అందించారు.

స్కూల్ డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ సంక్రాంతి అంటేతెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటువాటిని ఆచరించాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రాంబాబుఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్ధిని విద్యార్థులు పాల్గొన్నారు.

Scroll to Top