మూడు వేల‌కోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించిండి….మంత్రి నారాయణ

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఆదాయం కోల్పోయాయని మంత్రి నారాయణ అన్నారు. స్థానిక సంస్థలు అంటేనే సొంత నిధులతో స్వపరిపాలన చేయాలన్నారు. కానీ మూడు వేల‌కోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. స్థానిక సంస్థల హక్కులను కాలరాసిందని మండిపడ్డారు.

దేశంలోనే మొట్టమొదటిసారిగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుజనా సర్వీస్ సెంటర్ మంత్రి నారాయణ  ప్రారంభించారు. ఈ సందర్భంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ వాహనాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ‘సుజనా చౌదరి 2004 నుంచి నాకు పరిచయం. కేంద్ర మంత్రిగా ఆయనకు అపారమైన అనుభవం ఉంది. సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్రను ప్రారంభించినందుకు నా అభినందనలు. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఆదర్శ నియోజకవర్గంగా చేసేందుకు తపన పడుతున్నారు. 2014-19లో ఇదే శాఖకు నేను మంత్రిగా ఉన్నా. ఇప్పుడు కూడా అదేశాఖకు మంత్రిగా ఉన్నాను. గతంలో మా శాఖలకు బడ్జెట్ ఉండేది పనులు జరిగేవి. ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల కింద బడ్జెట్ పోతుంది’ అని తెలిపారు.

Scroll to Top