ఏసీబీ కి చిక్కిన చంద్రగిరి పంచాయితీ కార్యదర్శి మహేశ్వరయ్య

శ్రీ బాలాజీ జిల్లా సామాన్యుడి టీవీ వార్త: అవినీతి…అక్రమ సంపాదనకు కేరాఫ్ అడ్రస్‌..ఆయన ఆస్తులు ఏసీబీ దర్యాప్తులో కళ్లు చెదరాల్సిందే! ఆయన ఓ మాములు పంచాయతీ కార్యదర్శి..కానీ,
ఆయన ఆస్తుల విలువ చూస్తే బైర్లు కమ్మాల్సిందే గత ఫిబ్రవరి 28న చంద్రగిరి పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఏసీబీ సోదాల్లో ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు మహేశ్వరయ్య అనే పంచాయతీ కార్యదర్శి.
తిరుపతిలోని ఇంటి స్థలాలు, రెండు ఫ్లాట్లు, 2 కార్లు, కేజీకి పైగా బంగారు నగలు, 2 కిలోల వెండితో పాటు రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరయ్యకు బినామీ పేర్లతో కూడా ఆస్తులు ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. గంగవరంలో ఫామ్ హౌస్, బెంగళూరులో బినామీ పేర్లతో అపార్ట్‌మెంట్, బద్వేల్ లో అత్త పేరుతో వ్యవసాయ భూములు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటితో పాటు పలమనేరులోని సాయినగర్‌లో షాపింగ్ కాంప్లెక్స్, జీ ప్లస్ 2 బిల్డింగ్, గంగవరం మండలం కూర్నిపల్లి వద్ద ఉన్న ఓ ఫామ్ హౌస్, పక్కనే నాలుగున్నర ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.అయితే సోదాల్లో ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తుల విలువ దాదాపు రూ. 85 కోట్లకు పైగానే ఉండొచ్చని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Scroll to Top