తెలంగాణ: సామాన్యుడు వార్త: ఏప్రిల్ 09: టాలీవుడ్ కమెడియన్, హీర సప్తగిరి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. సప్తగిరి తల్లి చిట్టెమ్మ మంగళవారం నాడు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న ఆమె మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ మేరకు సప్తగిరి సోషల్ మీడియాలో ఈ విషయాన్ని ప్రకటించారు. బుధవారం నాడు తిరుపతిలో తన తల్లి అంత్యక్రియలు జరుగుతాయని తెలిపాడు. సప్తగిరికి తీరని లోటు కలిగిందని, అమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ నెటిజన్లు, సెలెబ్రిటీలు సంతాపాన్ని ప్రకటిస్తు న్నారు. సప్తగిరి ప్రస్తుతం కమెడియన్గా ఎక్కువ సినిమాల్ని చేయడం లేదు. హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ దిశగా చేసిన ప్రయత్నాలేవీ కూడా అంతగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. హీరోగా ట్రై చేసిన ప్రతీ సారి ఎదురు దెబ్బే తగులుతోంది. ఈ సారి పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమాతో వచ్చాడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావాన్ని చూపించలేక చతికిలపడిపోయింది.
