రేపల్లె… సికింద్రాబాద్ రైలు టెర్మినల్ మార్పు

బాపట్ల జిల్లా, రేపల్లె, సామాన్యుడు టివి వార్త: ఈనెల 15 నుండి రేపల్లె… సికింద్రాబాద్ రైలు టెర్మినల్ మార్పు చెర్లపల్లి వరకే..సికింద్రాబాద్ కాదు రేపల్లె చర్లపల్లి మధ్య నడుస్తుంది.. రేపల్లె నుండి సికింద్రాబాద్ వెళ్లే రైలు నెంబర్ 17645.. సికింద్రాబాద్ నుండి రేపల్లె వచ్చే 17646 నెంబర్ గల ట్రైన్లు.. ఈనెల 15వ తేదీ నుండి టెర్మినల్ మార్పు చేస్తూ చర్లపల్లి రైల్వే స్టేషన్ వరకు ట్రైన్ నడిచే విధంగా రైల్వే ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారని స్థానిక రైల్వే స్టేషన్ అధికారి తెలిపారు.. ఉదయం 7 గంటల పది నిమిషాలకు రేపల్లె నుండి సికింద్రాబాద్ వెళ్లే నెంబర్ 17645 తెనాలి గుంటూరు పిడుగురాళ్ల సత్తెనపల్లి నడికుడి మిర్యాలగూడ నల్గొండ మీదగా చర్లపల్లి రైల్వే స్టేషన్ కు మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు చేరుతుందని.. ప్రయాణికులు చర్లపల్లి రైల్వే స్టేషన్ లోని దిగి సికింద్రాబాద్ వెళ్ళవలసి ఉంటుందని తెలిపారు సికింద్రాబాద్ నుండి ప్రతిరోజు పగలు మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు బదులు చర్లపల్లి నుండి ఒంటి గంట 30 నిమిషాలకు బయలుదేరి గుంటూరు తెనాలి మీదుగా రేపల్లె రాత్రి 9 గంటల ఐదు నిమిషములకు వస్తుందని ప్రయాణికులు చర్లపల్లి రైల్వే స్టేషన్ లోని 15వ తేదీ నుండి ఒంటిగంట 30 నిమిషములకు రేపల్లె వచ్చే రైలు చర్లపల్లి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులు ఎక్కవలసి ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న రీ కన్స్ట్రక్షన్ పనుల వలన టెంపరరీ షిఫ్టింగ్ రైళ్లు మార్పు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు రేపల్లె రైల్వే స్టేషన్ అధికారి తెలిపారు ప్రయాణికులు ఈ మార్పును గమనించి ఈనెల 15వ తేదీ నుండి వర్తించే రైళ్ల మార్పును గమనించి ప్రయాణం చేయవలసిందిగా రైల్వే స్టేషన్ మాస్టర్ తెలిపారు…
Scroll to Top