న్యూఢిల్లీ:భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బీఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈమేరకు ప్రస్తుత సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కేంద్ర న్యాయశాఖకు సిఫార్సు చేశారు.జస్టిస్ ఖన్నా పదవీకాలం మే 13న ముగియనుంది. మరుసటి రోజు సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మహారాష్ట్రలోని అమరావతికి చెందిన జస్టిస్ గవాయ్ 1985 న్యాయవాద వృత్తిలో చేరారు. మహారాష్ట్ర హైకోర్టు జడ్జి, మాజీ అడ్వకేట్ జనరల్ బారిస్టర్ రాజా భోంస్లేతో ఆయన పనిచేశారు. 1987 నుంచి 1990 వరకూ ముంబై హైకోర్టులో ఆయన సొంతంగా లా ప్రాక్టీస్ చేశారు. 1992లో నాగపూర్ బెంచ్ అసిస్టెంట్ గవర్నమెంట్ లాయర్‌గా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా నియమితులయ్యారు. 2003లో హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులై 2005లో పెర్మనెంట్ జడ్జి అయ్యారు. 2019లో ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు.
జస్టిస్ గవాయ్ సీజేఐగా 6 నెలలు కొనసాగనున్నాయి. నవంబర్‌లో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. దళిత సామాజిక వర్గానికి చెందిన గవాయ్‌కు ముందు ఇదే సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ 2007లో సీజేఐగా బాధ్యతలు చేపట్టారు.