గుంటూరు:స్థానిక NGGO’S కాలనీలోని సుమేధ హై స్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయిలో
రెయినో ఆర్ట్స్ అకాడమీ గుజరాత్ వారు నిర్వహించిన చిత్రలేఖనం పోటీలలో 40 బంగారు, 35 రజత ,24 కాంస్య, 11 బెస్ట్ పెరఫార్మెన్సు మొత్తం 110 మెడల్స్ సాధించారు.
సుమేధహైస్కూల్ తరపున అత్యధిక విధ్యార్థులు పాల్గొనేలా ప్రోత్సహించిన డైరెక్టర్ మున్నంగి చంద్రశేఖర్ రెడ్డి ని కళారత్న అవార్డు తో సత్కరించారు. తమ విద్యార్థులు అధిక సంఖ్యలో మెడల్స్ సాధించడం పట్ల డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్నంగి సంజీవరెడ్డి విశ్రాంత వ్యాయమ ఉపాధ్యాయులు(సిద్ధార్థ జూనియర్ కాలేజీ, విజయవాడ)విద్యార్థులకు చదువు తో పాటు వివిధ రంగాలలో నైపుణ్యం కలిగి ఉండాలి అని తెలిపారు. అనంతరం విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్స్ అందచేసి వారిని అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల HM K.రాంబాబు, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
