తెలంగాణ గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1, గ్రూప్-2 మార్కుల జాబితాను విడుదల చేసింది. ఇవాళ గ్రూప్-3 ఫలితాలను విడుదల చేయనుంది.
ఇక 1365 ఈ గ్రూప్-3 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన టీఎస్‌పీఎస్‌ఈ గతేడాది నవంబర్‌లో పరీక్షలను నిర్వహించింది.
నవంబర్ 17,18వ తేదీల్లో ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించింది. మొత్తం 3 పేపర్లుగా నిర్వహించిన ఈ పరీక్షలను రాష్ట్ర వ్యాప్తంగా 5.36లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్ష ఫలితాలను ఇవాళ (మార్చి14)న విడుదల చేయనున్నట్లు టీఎస్‌పీఎస్‌ఈ తెలిపింది.