శ్రీవారి ఆలయానికి సమీపంలో గురువారం ఒక్కరోజే ఎనిమిది విమానాలు వెళ్లాయి. ఇవన్నీ ఉదయం 7.15 నుంచి 8 గంటల మధ్యన వెళ్లాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు.
తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయానికి సమీపంలో గురువారం ఒక్కరోజే ఎనిమిది విమానాలు వెళ్లాయి. ఇవన్నీ ఉదయం 7.15 నుంచి 8 గంటల మధ్యన వెళ్లాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి విమానాలు వెళ్లరాదు. అయితే ఇటీవల కాలంలో విమానాలు ఆలయానికి సమీపం నుంచే పోతున్నాయి. ఇప్పటికే దీనిపై తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే.