బుడమేరు ఆధునీకరణ పై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల.
గత టిడిపి హాయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానెల్ 37,500 క్యూసెక్కులకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు.
వెలగలేరు రెగ్యులేటర్ నుండి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్ద్యాన్ని పెంచేందుకు ప్రతిపాదన.
అమరావతి(ఏప్రిల్ 03):అమరావతి సచివాలయంలో బుడమేరు ఆధునీకరణ పై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష లో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, మరియు సీఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరైయారు.
బుడమేరు 3 గండ్లు మరమ్మత్తుల కోసం కేబినెట్ ఆమోదించిన రూ. 39.05 కోట్ల తో, త్వరలోనే టెండర్లు పిలిచి, పనులు పూర్తిచేయాలి అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు
గత టిడిపి హాయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానెల్ 37,500 క్యూసెక్కులకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు అప్పగించి 80శాతం పనులు పూర్తి చేశాం అని గత ప్రభుత్వంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ విస్తరణకు నిధులు ఉన్నా, మిగిలిన 20శాతం పనులు చేయలేదు అని తేలిపారు.2014-19 టిడిపి హాయాంలో ఎనికేపాడు యూటీ నుండి కొల్లేరు వరకు వెళ్ళే ఛానల్ విస్తరణ పనులను గత ప్రభుత్వం రద్దు చేసింది అని కోపపడ్డారు.
బుడమేరు డైవర్షన్ కెనాల్ ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలి అని వెలగలేరు రెగ్యులేటర్ నుండి కొల్లేరు వరకు ఓల్డ్ ఛానెల్ సామర్ద్యాన్ని పెంచేందుకు ప్రతిపాదనలపై సమగ్ర చర్చ.నిర్వహించారు.బుడమేరు ఓల్డ్ ఛానెల్ కు సమాంతరంగా మరొక కొత్త ఛానెల్ ను కూడా 10వేల క్యూసెక్కుల సామర్ద్యంతో అభివృద్ది చేయడానికి ప్రణాళికలు సిద్దం చెయ్యాలి అన్నారు
బుడమేరు వరదల నియంత్రణకు డిజాస్టర్ మానేజ్మెంట్ కింద, కేంద్రం సహాకారం తో ముందుకు వెళ్ళేలా ప్రపోజల్స్ తయారు చేస్తాం అని మున్సిపల్, రెవెన్యూ, డిజాస్టర్ మానేజ్మెంట్ శాఖలు సమన్వయం చేసి ప్రత్తిపాదన ముఖ్యమంత్రి ముందు ఉంచుతాం అని అన్నారు.