విజయవాడ, కానూరు, సామాన్యుడు టివి వార్త:
గౌరవనీయ MJPAPBCWREIS సెక్రటరీ శ్రీమతి మాధవీలత గారిని కానూరు ఆఫీసులో కలిసి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో సాధించిన అద్భుతమైన ఫలితాలకు గుర్తింపుగా సత్కరించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల అసోసియేషన్ సభ్యులు. మహత్మా జ్యోతిబా ఫూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలలో అసాధారణంగా 98% ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశాయి, ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ మేనేజ్‌మెంట్ కళాశాలల పనితీరు ప్రమాణాలను అధిగమించాయి. ఈ సందర్భంగా ఇంతటి ఫలితాలు వచ్చేలా కృషి చేసిన ఉపాధ్యాయులు అందరికీ MJPAPBCWRIES సెక్రటరీ మాధవిలత అభినందనలు తెలియచేసారు.

