IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా అక్షర్‌ పటేల్‌

ఐపీఎల్‌-2025 (IPL 2025) సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తమ కొత్త కెప్టెన్‌ పేరును ప్రకటించింది. టీమిండియా స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌(Axar Patel)కు సారథిగా పగ్గాలు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా వేదికగా ఆధికారిక ప్రకటన చేసింది.

తొలుత స్టార్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ మెనెజ్‌మెంట్‌ భావించినప్పటికీ.. అతడు అందుకు ఆసక్తి చూపలేదు. ఈ క్రమంలోనే అక్షర్‌ పటేల్‌ను తమ జట్టు సారథిగా ఢిల్లీ ఫ్రాంచైజీ నియమించింది. 

Scroll to Top