JNTU K అనుబంధం తో KITS FDP

కిట్స్ లో JNTUK అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం : మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి
బయోమెడికల్‌లో ప్రాసెసింగ్  మరియు కమ్యూనికేషన్ అప్లికేషన్లు

 

వింజనంపాడు: కె.కె.ఆర్ అండ్ కె.ఎస్.ఆర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కిట్స్ కళాశాల) లో JNTUK వారి సహకారంతో వారం రోజుల (2-6-2025 నుంచి 6-6-2025) పాటు ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి బయోమెడికల్‌లో ప్రాసెసింగ్
మరియు కమ్యూనికేషన్ అప్లికేషన్లు అధ్యాపక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది అని, ఈ కార్యక్రమానికి రిసోర్స్ పర్సన్స్ గా వివిధ IIT, NIT, యూనివర్సిటీస్ నుంచి డాక్టర్ తరుణ్ కుమార్ రెడ్డి బొల్లు -ఐఐటి రూరికే, డాక్టర్ జె రవికుమార్ -ఎన్ఐటి వరంగల్ ,డాక్టర్ సిహెచ్ వెంకట రామారావు ఎన్ఐటి వరంగల్ , డాక్టర్ ఎన్ బాలాజీజేఎన్టీయూకే కాకినాడ,ఎ రజని జేఎన్టీయూకే కాకినాడ,
నుండి వస్తున్నారు అని, ఈసీఈ విభాగతిపతి డాక్టర్ ఎన్ ఆదినారాయణ గారు తెలియచేశారు.

             ఈ FDP లో మొదటి రోజు డాక్టర్ఎన్ బాలాజీ professorజేఎన్టీయూకే కాకినాడ,ఎ రజని
జేఎన్టీయూకే కాకినాడ,పాల్గొన్నారని ,ఆధునిక టెక్నాలజీ సహకారంతో బయో మెడికల్
విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు అని వివరించారు. మరియు ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా అధ్యాపకులలో అవసరమైన నైపుణ్యాలను మరియు జ్ఞానాన్ని, నూతన ఆవిష్కరణలు, నూతన టెక్నాలజీస్ గురించి తెలుసుకోవడం మూలంగా విద్యార్థిని విద్యార్థులకు లకు కూడా బోధించవచ్చని, వారి చేత బయో మెడికల్ నూతన ఆవిష్కరణలను మరియు ఇలాంటి వాటిని ఇంజనీరింగ్ టెక్నాలజీ ద్వారా దేశానికి ఉపయోగపడే అధునాతన మిషన్స్ ని తయారు చేయవచ్చు అని తెలియజేశారు. మిగతా ఐదు రోజులలో కూడా ఇలాంటి ఐఐటి ప్రొఫెసర్ల చేత బయో మెడికల్‌లో మెషిన్ లెర్నింగ్
టెక్నాలజీ ద్వారా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు ఫలదాయకమైనటువంటి విధానాలను తెలుసుకోవచ్చని తెలియజేశారు.

                 అధ్యాపకులు ఇలాంటి కార్యక్రమాలను ఉపయోగించుకుని నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించవచ్చని కళాశాల ఛైర్మన్ శ్రీ కోయి సుబ్బారావు గారు, కార్యదర్శి శ్రీ కోయి శేఖర్ గారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ డా.పి.బాబు గారు, అకడమిక్ డైరెక్టర్ డా.కె.హరిబాబు గారు, విభాగాధిపతి ఎన్ ఆదినారాయణ గారు మరియు ఈ FDP కోఆర్డినేటర్ డాక్టర్ సరళ పి, అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన రిసోర్స్ పర్సన్స్ ను కళాశాల ఛైర్మన్ జ్ఞాపికతో సత్కరించారు.

Scroll to Top